Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరేంద్రమోదీ యాప్‌తో జర భద్రం.. సంచలన విషయాలు వెల్లడించిన ఫ్రాన్స్ నిపుణుడు

  • నమో యాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు రహస్యంగా అమెరికా సంస్థ చేతికి
  • వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సహా చేరుతున్న సమాచారం
  • ఆందోళనకరమన్న ఫ్రాన్స్ సెక్యూరిటీ నిపుణుడు ఎల్డర్సన్
ప్రధాని నరేంద్రమోదీ పేరుతో ప్రభుత్వం రూపొందించిన ‘నమో’ యాప్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుడు ఇలియట్ ఎల్డర్సన్ హెచ్చరించారు. ఈ యాప్ ఉపయోగించే యూజర్ల సమాచారం రహస్యంగా అమెరికాకు చెందిన ‘క్లెవర్ ట్యాప్’ అనే సంస్థకు చేరుతోందంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యూజర్ల సమాచారం ఎవరికీ తెలియకుండా క్లెవర్ ట్యాప్‌ డొమైన్ అయిన ‘ఇన్‌డాట్ డబ్ల్యూజెడ్ఆర్‌కేటీ డాట్ కామ్’కు వెళ్లిపోతోందని వివరించారు. నమో యాప్‌ను వినియోగిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు సహా ఫొటోలు కూడా ఆ సంస్థకు చేరుతున్నాయన్నారు. క్లెవర్ ట్యాప్ ఓ అత్యాధునిక యాప్ నిర్వహణ వేదికని, యూజర్లను గుర్తించి డెవలపర్స్‌ను అభివృద్ధి చేసేందుకు మార్కెటింగ్ నిపుణులకు ఇది సాయపడుతుందని ఎల్డర్సన్ వివరించారు. యూజర్ల సమాచారాన్ని కెప్లెర్ ఎందుకు భద్ర పరుస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమన్నారు. కాగా, క్లెవర్ ట్యాప్‌ను ‘గోడాడీ’ సంస్థ నిర్వహిస్తుండడం గమనార్హం.
Namo app
Narendra Modi
users

More Telugu News